Sunday, 13 August 2017

భారత దేశంలో జాతక సమస్యలు ... సరియగు విధానము ...

అమ్మాయిలపై ఎంతగానో రీసెర్చి చేసిన నేను నా అనుభవాలను కోడీకరిస్తూ / క్రోడీకరిస్తూ (చూబ్రౌణ్య ని.) వారి అంతర్గత స్వరూప స్వభావాలను రాశుల వారీగా నాదైన శైలిలో వర్గీకరించాను వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం ... 

  1. మేషంకొండగొర్రెకీ మామూలు గొర్రెకీ మధ్యస్తమైన స్వభావం కలవారుప్రేమికులవెంట కేవలము గొల్లవాని వెంట మేక లేక గొర్రె వలెనే వెళుతూంటారు … 

  1. వృషభంచియ్యబట్టి ఘణీమని రంకెవేయు వృషభరాజముతో సరిసమానములగు పౌరుషము గల స్త్రీలుసహజముగా ఒకమానాన లొంగరువంగరుఒంగోలు ఆంబోతుల వలెనే … 

  1. మిధునంఒంటరి జీవనము కేవలం భరియింపలేని సాధుజీవులుతరతమ భేదభావములను పక్కనవేసి అతిసహజమయిన సాంగత్యములో కలగలచిపోవుదురు. 

  1. కర్కాటకంవీరి ప్రేమ మనలను ఎండ్రకాయ వలెనే పట్టివేయును, their love stings ... Auch ! It precisely strikes on the love producing spot in the central nervous system and you'll be thoroughly activated and rejuvenated … 

  1. సింహంఅతి గంభీరమయిన రాజసం ఉట్ఠిపడు అమ్మాయిలుతమ ఆహారమునకు మరొకరి వేటపై ఆధారపడరు ... 

  1. కన్యఅతిసుందర లలితమగు స్త్రీ సహజ స్వభావము గలవారువీరి లాలన పురుషులకు భగవంతుని కానుక. 

  1. తులప్రేమ వ్యవహారములలో ఎంతో ఆచితూచి అడుగులు వేయు స్త్రీలుతమకు కావలసినవీతామివ్వవలసినవీ తూచి మరీ తీసుకొను / ఇచ్చు వారు. 

  1. వృశ్చికంఅతి బాధాకరమగు నొప్పితో సలిపివేయు ప్రేమకాటు వేయు ఆడువారుదీనికి సమయమునకు చికిత్స అందనిచో మనము స్వర్గస్తులమవుదుము ... 

  1. ధనుస్సుప్రేమబాణమును అర్జున ఫల్గున పార్థుని వలెనే గురిచూసి వదులు స్త్రీలువీరికి చెట్టుపై కొట్టవలసిన పండుతప్ప మరొకటి దృక్పథమున కానరాదని మనవి ... 

  1. మకరంనీటి అడుగున మాటువేసి నీరుత్రాగు బాటసారులను లోనికి గుంజివేయువారుస్థానబలిమి గాని తమబలిమి కాదయా ... అవురా అనిపించగలదు ! 

  1. కుంభంతమ జీవిత భాగస్వామిని పూర్ణకుంభముతో ఆరాధించు స్త్రీలువీరి భక్తి అనురాగములు అచంచలములయినవి ... 

మీనంచేప వంటి కళ్ళతో మనలనాకర్షించి వలలో వేసుకొను అమ్మాయిలువీరి వ్యక్తిత్వమును మనం అవగాహన చేసుకొనడం అంతసులువు కాదుచేపవలెనే చేతిలోంచి జారిపోతూంటారువీరి హృదయమొక అగాధమవు జలనిధిఅందులో ఆణిముత్యం పట్టుకోవడం నీ పని ! 

/ కాసేపు నవ్వుకోండి ... నన్ను కొట్టేరు ! /